Header Banner

ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!

  Wed Mar 12, 2025 08:53        Politics

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రౌడీషీటర్, వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వటంతో మీడియా కంటపడకుండా ఈరోజు(బుధవారం) ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకొని జైలు సూపరింటెండెంట్‌‌కు బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?


అనిల్‌పై ఏపీ హై కోర్టు ఆగ్రహం..
కాగా..జగన్‌ హయాంలో చెలరేగిపోయిన రాజ్యాంగేతర శక్తి, రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని, తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌తో హైకోర్టుకే టోకరా వేసి మధ్యంతర బెయిలు పొడిగించుకున్న సంగతి తెలిసిందే. బెయిలు గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిపోయింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అతడు ఆ సమయంలోపు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. కానీ, మళ్లీ బెయిలు పొడిగించాలంటూ మంగళవారం తన న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించాడు. అదేం కుదరదని... సాయంత్రంలోపు అతను జైల్లో లొంగిపోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా... బోరుగడ్డ తన అజ్ఞాతం వీడలేదు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ముగిసిన గ్రేస్ పీరియడ్..
‘హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్‌ గడువు ముగిసేలోపు బోరుగడ్డ అనిల్‌ జైలుకు వచ్చి లొంగిపోలేదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు, పై అధికారులకు తెలియచేశాం’ అని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. సాయంత్రం 5 గంటల్లోపు చెన్నై నుంచి విమానంలో వచ్చి అయినా జైలు సూపరింటెండెంట్‌ ముందు లొంగిపోవలసిందేనని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గ్రేస్‌ పీరియడ్‌ అరగంట కలుపుకొని సాయంత్రం 5.30 గంటలు దాటినా బోరుగడ్డ జైలుకు రాలేదు. అయితే బుధవారం రాజమండ్రిలో జైలు సూపరింటెండెంట్‌ ఎదుట అనిల్ లొంగిపోయాడు.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ycpleader #highcurt #serious #centraljail #todaynews #flashnews #latestnews